Job Mela: తెలంగాణలో జాబ్ మేళా ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలో ఈనెల 18న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మంచిర్యాల ప్రభుత్వ ఐటిఐ కాలేజీ ఆవరణలోని ఉపాధి కల్పనా కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నారు. మెడ్ ప్లస్ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ 100, ఆడిట్ అసిస్టెంట్ 30, ఫార్మసిస్ట్ 40, కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ 50 పోస్టులను భర్తీ చేస్తున్నారు. జాబ్ మేళాలో ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:
ఉపాధి కల్పనా కార్యాలయం, మంచిర్యాల జిల్లా నుంచి ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ
మెడ్ ప్లస్ సంస్థ వారు ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
భర్తీ చేసే ఉద్యోగాల వివరాలు:
- జూనియర్ అసిస్టెంట్: 100
- ఆడిట్ అసిస్టెంట్: 30
- ఫార్మాసిస్ట్: 40
- కస్టమర్ సపోర్ట్ అసోసియేట్: 50
అర్హతల వివరాలు:
ఈ జాబ్ మేళాలో ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.
Age ఎంత ఉండాలి?
జాబ్ మేళాలో 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు పాల్గొనవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ మేళా నిర్వహణ తేదీ:
2024 డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10:30 కు జాబ్ మేళా నిర్వహిస్తారు.
జాబ్ మేళా నిర్వహణ ప్రదేశము:
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ కాలేజీ ఆవరణలోని ఉపాధి కల్పనా కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తారు.
జాబ్ లొకేషన్:
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులు గోదావరిఖని, కరీంనగర్, మంచిర్యాల, హైదరాబాద్ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి పత్రిక ముఖంగా వచ్చిన నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకోండి
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.