Jobs: 35వేల జీతంతో తెలంగాణలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
Technical Assistant Jobs
Jobs: తెలంగాణలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు (Indian Nationals Only) ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2025 డిసెంబర్ 23వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తులను బట్టి రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 4 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
విద్యార్హతలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సైన్స్ గ్రూపులో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు (లేదా) ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో మూడు సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మైక్రోసాఫ్ట్ వర్డ్ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.
Age limit
ఈ ఉద్యోగాలకు 50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది .
Selection Process
వచ్చిన దరఖాస్తులను బట్టి రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగాలతో అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారం కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
దరఖాస్తుకు చివరి తేదీ
2025 డిసెంబర్ 23వ తారీకు లోపు offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా
Prof. Bramanandam Manavathi, Project Director, ANRF-PAIR Project, #F52, Department of Biochemistry, School of Life Sciences, University of Hyderabad, Hyderabad 500 046, Telangana.

