5,369 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలు
నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మరో గుడ్ న్యూస్ తెలిపింది. 5,369 ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 549 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పోస్టును అనుసరించి పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ssc.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు: 5,369
పోస్టులు: సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఫర్టిలైజర్ ఇన్స్పెక్టర్, క్యాంటీన్ అటెండెంట్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, డిప్యూటీ రేంజర్, లైబ్రేరియన్, టెక్నీషియన్, జూనియర్ అకౌంటెంట్, స్టోర్ క్లర్క్, టెక్నికల్ అసిస్టెంట్, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్, క్లర్క్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామర్, లాబరేటరీ అసిస్టెంట్, స్టోర్ కీపర్, లైబ్రరీ క్లర్క్, లీగల్ అసిస్టెంట్, అసిస్టెంట్ కెమిస్ట్, జూనియర్ ఇంజనీర్, టెక్నీషియన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. జూన్/జూలై నెలలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహిస్తారు.
పరీక్ష విధానం:
పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 50 మార్కులు కేటాయిస్తారు. జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు, ఇంగ్లీష్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
ప్రతి తప్పు సమాధానానికి 0.50 నెగిటివ్ మార్క్ ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
2023 మార్చి 6వ తారీకు నుంచి 2023 మార్చి 27వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి