Government Jobs: 10th క్లాస్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
10th క్లాస్ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 1,558 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవాల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 21 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
1.మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (గ్రూప్-సి నాన్ గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్): 1198 పోస్టులు
2.హవాల్దార్ (గ్రూప్-సి నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్): 360 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 1,558
విద్యార్హతలు:
10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2023 ఆగస్టు ఒకటవ తారీకు నాటికి.. పోస్టులను అనుసరించి 18-25, 18-27 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
ఎంటీఎస్ ఖాళీలకు: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
హవాల్దార్ ఖాళీలకు: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు/ పరీక్ష ఫీజు:
రూ.100/- ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు:
చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
30-06-2023 నుంచి 21-07-2023 వరకు.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ:
2023 జూలై 21వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
కంప్యూటర్ ఆధారిత పరీక్షల నిర్వహణ:
2023 సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి