డిగ్రీ అర్హతతో 4,187 ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | SSC Sub Inspector Notification 2024
SSC Sub Inspector Notification 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 4,187 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నుంచి ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 4,187 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పరీక్ష ద్వారా ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన (సీఏపీఎఫ్) బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీలో సబ్-ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 28వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయసు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
1.ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)- పురుషులు: 125 పోస్టులు
2.ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) మహిళలు: 61 పోస్టులు
3.సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ) లో సబ్ ఇన్స్పెక్టర్ (జీడీ): 4,001 పోస్టులు
విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2024 ఆగస్టు 1వ తారీకు నాటికి 20 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
నెలకు రూ.35,400/- నుంచి రూ.1,12,400/- వరకు జీతం ఉంటుంది.
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రాతపరీక్షలను 2024 మే 9, 10, 13 తారీకుల్లో నిర్వహిస్తారు.
తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
దరఖాస్తు విధానం:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
రూ.100/- ఫీజు చెల్లించాలి.
ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 మార్చి 28వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.