తెలంగాణలో 10th అర్హతతో ఫైర్ మ్యాన్, డిగ్రీ అర్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | SPMCIL Recruitment 2024
SPMCIL Recruitment 2024: హైదరాబాద్ లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఫైర్ మాన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జూనియర్ టెక్నీషియన్ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
Join Our Whatsapp Group
హైదరాబాదులోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఫైర్ మాన్, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10th క్లాస్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా ఫైర్ మ్యాన్, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
ఫైర్ మ్యాన్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
సూపర్వైజర్ పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
సూపర్వైజర్: ₹.27,600/- నుంచి ₹.95,910/- వరకు
Jr.ఆఫీస్ అసిస్టెంట్: ₹.21,540/- నుంచి ₹.77,160/- వరకు
జూనియర్ టెక్నీషియన్: ₹.18,780/- నుంచి ₹.67,390/- వరకు
ఫైర్ మ్యాన్: ₹.18,780/- నుంచి ₹.67,390/- వరకు
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
OC, EWS, BC అభ్యర్థులు: ₹.600/-
SC, ST అభ్యర్థులు: ₹.200/- ఫీజు చెల్లించాలి
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 ఏప్రిల్ 15వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.