Telangana Jobs: సింగరేణిలో 1344 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..
తెలంగాణ రాష్ట్రం, కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, HRD విభాగం నుంచి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2023-24 సంవత్సరానికి వివిధ ట్రేడుల్లో అప్రెంటిషిప్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 1344 మంది అభ్యర్థులకు ఈ ఏడాది అప్రెంటిషిప్ నకు అవకాశం కల్పిస్తున్నారు. పదవ తరగతితో పాటు ఐటిఐ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేదు, ఫీజు లేదు, ఇంటర్వ్యూ ఉండదు. మెరిట్ మరియు ఐటీఐ సీనియార్టీని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
స్థానిక జిల్లాల వివరాలు:
అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాల వారు స్థానికులు. వీరికి 95 శాతం రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన జిల్లాల వారంతా స్థానికేతరులు. వీరికి 5 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. సింగరేణి ఉద్యోగుల పిల్లలు, సింగరేణి ప్రభావిత ప్రాంతాల వారు, నిర్వాసితుల పిల్లలకు సీట్ల భర్తీలో ప్రాధాన్యం ఉంటుంది.
ఖాళీల వివరాలు:
ట్రేడ్ అప్రెంటిషిప్ మొత్తం ఖాళీలు: 1344
ట్రేడ్లు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్ మ్యాన్ (సివిల్), మెకానిక్ డీజిల్, మౌల్డర్, వెల్డర్.
విద్యార్హతలు:
పదో తరగతి విద్యార్హతతో పాటు ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
స్టైఫండ్:
ట్రేడును బట్టి నెలకు రూ.7,700 నుంచి రూ.8050 వరకు చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ:
ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన సీనియారిటీ ఆధారంగా. సీనియారిటీ ప్రకారం అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే ఐటీఐ మార్కులను పరిగణణలోకి తీసుకుంటారు.
దరఖాస్తు విధానం:
2023 జూన్ 28వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని చేసుకుని హార్డ్ కాపీ, సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి రిజిస్టర్డ్ పోస్టు/ కొరియర్/ వ్యక్తిగతంగా ఏదైనా ఎంవీటీసీ కేంద్రాల్లో అందజేయాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి