SI, Constable Jobs: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం..
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డైరెక్టోరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఎస్సై, కానిస్టేబుల్ గ్రూప్-బి గ్రూప్-సి (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీయల్) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
- ఎస్సై (వెహికల్ మెకానిక్): 06
- ఎస్సై (ఆటో ఎలక్ట్రీషియన్): 02
- ఎస్సై (స్టోర్ కీపర్): 01
- కానిస్టేబుల్ ( ఓ.టి.ఆర్.పి): 02
- కానిస్టేబుల్ (ఎస్.కే.టీ): 07
- కానిస్టేబుల్ (ఫిట్టర్): 01
- కానిస్టేబుల్ (ఆటో ఎలక్ట్రీషియన్): 05
- కానిస్టేబుల్ (వెహికల్ మెకానిక్): 01
- కానిస్టేబుల్ (బి.ఎస్.టి.ఎస్): 01
- కానిస్టేబుల్ (వెల్డర్): 02
- కానిస్టేబుల్ (పెయింటర్): 02
మొత్తం పోస్టుల సంఖ్య: 30
వయోపరిమితి:
ఎస్సై పోస్టులకు: 30 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు
కానిస్టేబుల్ పోస్టులకు: 18 నుంచి 25 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు:
కానిస్టేబుల్ పోస్టులకు: పదవ తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సై పోస్టులకు: డిప్లొమా (ఆటోమొబైల్ ఇంజనీరింగ్/ మెకానికల్ ఇంజనీరింగ్/ ఆటో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
గ్రూప్-బి ఎస్సై పోస్టులకు: రూ.35,400/- నుంచి రూ.1,12,400/- వరకు
గ్రూప్-సి కానిస్టేబుల్ పోస్టులకు: రూ.21,700/- నుంచి రూ.69,100/- వరకు
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
13-03-2023 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
rectt.bsf.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు