SBI Clerk Recruitment 2024 | స్టేట్ బ్యాంకుల్లో 13,735 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. తెలుగులోనే పరీక్ష
SBI Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్ కేడర్ పోస్టులు) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 13,735 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. తెలుగు భాషలోనూ పరీక్ష ఉంటుంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది 20 నుంచి 28 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 13,735 జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్ కేడర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హతలు: ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన బెడతలు దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక భాష వచ్చి ఉండాలి.
Age limit: 20 నుంచి 28 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Salary వివరాలు: రూ.26,730/- జీతం ఉంటుంది. అలవెన్సులు అన్నీ కలుపుకొని రూ.40,000 వరకు జీతం వచ్చే అవకాశం ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్: ప్రిలిమ్స్, మెయిన్స్, స్థానిక భాషా పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు.
Apply చేయు విధానం: ఈ ఉద్యోగాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు/ పరీక్ష ఫీజు: ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఎటువంటి ఫీజు ఉండదు. ఫ్రీగానే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు ఓసి, బిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ₹750 ఫీజు ఉంటుంది.
Apply చేయడానికి చివరి తేదీ: 2025 జనవరి 7వ తారీకు లోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తీ వివరాలు చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
✅నిరుద్యోగుల కోసం: TS SI/Constable.. TS ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP SI/Constable.. AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్..SSC GD Constable “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.