తెలంగాణలో అటెండర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పర్మినెంట్ ఉద్యోగాలు | RFCL Recruitment 2024
RFCL Recruitment 2024: తెలంగాణ రాష్ట్రంలో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL), రామగుండం ప్లాంట్ నందు అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
✅అతి తక్కువ ధరలో “TSPSC Group-2,3,4; TS SI/Constable, RPF Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్రంలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL), రామగుండం ప్లాంట్ రెగ్యులర్ ప్రాతిపదికన అటెండెంట్ గ్రేడ్-1 (నాన్ ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 39 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ పాసై, సంబంధిత ట్రేడులో ఐటీఐ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…
పోస్టుల వివరాలు:
1.అటెండెంట్ గ్రేడ్-1 (మెకానికల్): 15 పోస్టులు
2.అటెండెంట్ గ్రేడ్-1 (ఎలక్ట్రికల్): 15 పోస్టులు
3.అటెండెంట్ గ్రేడ్-1 (ఇన్స్ట్రుమెంటేషన్): 09 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 39.
విద్యార్హతలు:
10th క్లాస్ పాసై, సంబంధిత ట్రేడులో ఐటీఐ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐటీఐ ట్రేడులు:
ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మెకానిక్- హెవీ వెహికల్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్.
వయోపరిమితి:
18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
నెలకు రూ.21,500/- నుంచి రూ.52,000/-
ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్(ట్రేడ్) టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు/పరీక్ష ఫీజు:
రూ.200/- ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 ఫిబ్రవరి 22వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
Notification Link
Official Website
✅అతి తక్కువ ధరలో “TSPSC Group-2,3,4; TS SI/Constable, RPF Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి