10th క్లాస్ అర్హతతో 12,828 పోస్టు మాస్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
పోస్టల్ శాఖ నుంచి గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి మరొక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 12,828 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కులను ఆదరణ చేసుకుని అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 12,828
1.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీలు: 118
2.తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలు: 96
వయోపరిమితి:
2023 జూన్ 11వ తారీఖు నాటికి 18 నుంచి 40 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబిసి అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు:
పదవ తరగతి పాసై, కంప్యూటర్ పరిజ్ఞానం మరియు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.
జీతభత్యాలు:
BPM పోస్టులకు: రూ.12,000/- నుంచి రూ.29380/- వరకు
ABPM పోస్టులకు: రూ.10,000/- నుంచి రూ.24,470/- వరకు
దరఖాస్తు ఫీజు/ పరీక్ష ఫీజు:
రూ.100/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
పదవ తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 మే 22వ తారీకు నుంచి 2023 జూన్ 11వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి