Breaking News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియామకం.. పలు రాష్ట్రాల గవర్నర్ లను మార్చిన కేంద్ర ప్రభుత్వం..
పలు రాష్ట్రాలకు గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను చత్తీస్ఘడ్ గవర్నర్ గా నియమించారు. మహారాష్ట్రకు రమేశ్ బైస్, సిక్కిం రాష్ట్రానికి లక్ష్మణ్ ప్రసాద్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి త్రివిక్రమ్ పట్నాయక్, జార్ఖండ్ రాష్ట్రానికి రాధాకృష్ణన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి శివప్రసాద్ శుక్లా, మణిపూర్ రాష్ట్రానికి అనసూయ, నాగాలాండ్ రాష్ట్రానికి గణేషన్, బీహార్ రాష్ట్రానికి రాజేంద్ర విశ్వనాథ్, అస్సాం రాష్ట్రానికి గులాబ్ చంద్ కటారియా, మేఘాలయ రాష్ట్రానికి చౌహన్, లడక్ కు బీ.డీ. మిశ్రా లను గవర్నర్లుగా కేంద్రం నియమించింది.