AP Latest Jobs: కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకులో ఉద్యోగాల భర్తీ.. అటెండర్, క్లర్క్, ఆఫీసర్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కాకినాడలోని ది కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజర్-లా, ఆఫీసర్, క్లర్క్ కమ్ క్యాషియర్, అటెండర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, పీజీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం వివరాలు తెలుసుకుందాం…
పోస్టుల వివరాలు:
1.అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్: 02 పోస్టులు
2.మేనేజర్- లా: 01 పోస్టు
3.ఆఫీసర్: 09 పోస్టులు
4.క్లర్క్ కమ్ క్యాషియర్: 16 పోస్టులు
5.అటెండర్(సబ్ స్టాఫ్): 05 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 33.
విద్యార్హతలు:
ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆఫ్లైన్ దరఖాస్తులను రిజిస్టర్డ్ పోస్టు/ కొరియర్ ద్వారా పంపాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
ది కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్,
రామారావుపేట,
కాకినాడ- 533004.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 అక్టోబర్ 31వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి