Job Mela: విశాఖపట్నం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, బాపట్ల జిల్లా, నంద్యాల జిల్లాల్లో రేపు జాబ్ మేళా
Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 2025 డిసెంబర్ 12వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విశాఖపట్నం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, బాపట్ల జిల్లా, నంద్యాల జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పనా శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బీటెక్, పీజీ, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
ముఖ్య గమనిక: జిల్లాల వారీగా జాబ్ మేళా నిర్వహించే ప్రాంతాల వివరాల కొరకు, కంపెనీల వివరాల కొరకు, అర్హతల వివరాల కొరకు, జీతభత్యాల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
Job Mela నిర్వహించే సంస్థ
ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తారు.
విద్యార్హతలు
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బీటెక్, పీజీ, ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
Age limit
జాబ్ మేళాకు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు పాల్గొనవచ్చు .
Selection Process
డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు.
Job Mela నిర్వహణ తేదీ
- 12-12-2025 తేదీన జాబ్ మేళా నిర్వహిస్తారు
- జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని.. మీ ప్రొఫైల్లో లాగిన్ అయ్యి అన్ని కంపెనీలకు అప్లై చేసుకుని అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూకు హాజరు కావలెను
- ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, విద్యార్హత పత్రాలు జిరాక్స్ కాపీలు వెంట తీసుకుని వెళ్ళవలెను
Job Mela నిర్వహణ ప్రదేశము
- నంద్యాల జిల్లా: Sri Venkateswara Degree College, Atmakur
- గుంటూరు జిల్లా: Velaga Nageswara Rao of Engineering College, Near G.B.C Road, Ponnuru
- విశాఖపట్నం జిల్లా: TSR & TBK (Apple I) School, Sri nagar, Gajuwaka
- బాపట్ల జిల్లా: N.R. & P.M. High School, Chirala Constituency
- కృష్ణా జిల్లా: SSR Degree College, Machilipatnam

