Job Mela: పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు
Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, ఉరవకొండ పాలిటెక్నిక్ కళాశాలలో 2025 డిసెంబర్ 11 వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుంది. వివిధ కంపెనీలలో మొత్తం 540 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Job Mela నిర్వహిస్తున్న సంస్థ
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ & జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
Job Mela లో పాల్గొనే కంపెనీలు
జాబ్ మేళాలో మొత్తం 12 కంపెనీలు పాల్గొంటున్నాయి. Genisys, Cogent, Teleperformance, NIIT Axis Bank, NIIT HDFC Bank, Kia India, Ether, MNC Mobile Manufacturing company, Rangson Aerospace, H1 HR Solutions private limited, Puskal Agrotec limited, PVRINOX కంపెనీలు పాల్గొంటున్నాయి.
విద్యార్హతలు
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
Age limit
కంపెనీల వారీగా పోస్టులను అనుసరించి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
Selection Process
ఇంటర్వ్యూ, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు, ఫీజు ఉండదు.
Job Mela నిర్వహణ తేదీ
- 11-12-2025 ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు
- ఇంటర్వ్యూకు హాజరయ్య అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని.. మీ ప్రొఫైల్ లాగిన్ అయ్యి అన్ని కంపెనీలకు అప్లై చేసుకుని అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూకు హాజరు కావలెను
- ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా తో పాటు ఒక ఫోటో, ఆధార్ కార్డు, పాన్ కార్డు, విద్యార్హత పత్రాలు జిరాక్స్ కాపీలు వెంట తీసుకొని వెళ్ళవలెను
Job Mela నిర్వహణ ప్రదేశము
అనంతపురం జిల్లా: Government Polytechnic College, Chinna Musturu, Uravakonda.

