10th క్లాస్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 458 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి పాసై, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
కానిస్టేబుల్ (డ్రైవర్): 458 పోస్టులు
OC, BC, SC, ST & EWS అన్ని కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని కేటగిరీల వారికి ఖాళీలు ఉన్నాయి.
వయోపరిమితి:
21 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు:
పదవ తరగతి పాసై, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష ఫీజు/ అప్లికేషన్ ఫీజు:
రూ.100/- ఫీజు చెల్లించాలి.
SC, ST అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ప్రాక్టికల్ టెస్ట్ & మెడికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Note: ITBP వెబ్సైట్ నుంచి పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రాత పరీక్షకు సంబంధించిన సిలబస్, ఫిజికల్ టెస్టుల వివరాలు తెలుసుకోగలరు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 జూన్ 27వ తారీకు నుంచి 2023 జూలై 26వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
www.recruitment.itbpolice.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి షార్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో SSC GD Constable, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి