ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Junior Assistant Notification 2024
IIT Tirupati Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Join Our Whatsapp Group
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టూడెంట్ కౌన్సెలర్, హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ నర్సింగ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థుల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
1.స్టూడెంట్ కౌన్సెలర్: 01 పోస్టు
2.హిందీ ట్రాన్స్లేటర్: 01 పోస్టు
3.జూనియర్ నర్సింగ్ ఆఫీసర్: 01 పోస్టు
4.జూనియర్ అసిస్టెంట్: 03 పోస్టులు
5.జూనియర్ టెక్నీషియన్: 02 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 08
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ (మెకానికల్ ఇంజినీరింగ్), పీజీ, జనరల్ నర్సింగ్, విద్యార్హతతో పాటు పని అనుభవం కలిగిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
1.స్టూడెంట్ కౌన్సెలర్: 45 సంవత్సరాల లోపు
2.హిందీ ట్రాన్స్లేటర్: 35 సంవత్సరాల లోపు
3.జూనియర్ నర్సింగ్ ఆఫీసర్: 35 సంవత్సరాల లోపు
4.జూనియర్ అసిస్టెంట్: 32 సంవత్సరాల లోపు
5.జూనియర్ టెక్నీషియన్: 32 సంవత్సరాల లోపు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
1.స్టూడెంట్ కౌన్సెలర్: రూ.56,100/- నుంచి రూ.1,77,550/- వరకు
2.హిందీ ట్రాన్స్లేటర్: రూ.35,400/- నుంచి రూ.1,12,400/- వరకు
3.జూనియర్ నర్సింగ్ ఆఫీసర్: రూ.35,400/- నుంచి రూ.1,12,400/- వరకు
4.జూనియర్ అసిస్టెంట్: రూ.25,500/- నుంచి రూ.81,100/- వరకు
5.జూనియర్ టెక్నీషియన్: రూ.25,500/- నుంచి రూ.81,100/- వరకు
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ద్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ:
2024 ఏప్రిల్ 11 వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి