IB Recruitment: 797 ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 797 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ, డిప్లొమా విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2: 797 పోస్టులు
విద్యార్హతలు:
1).డిప్లమా ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (లేదా) ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ (లేదా) ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (లేదా) ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ (లేదా) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (లేదా) కంప్యూటర్ సైన్స్ (లేదా) కంప్యూటర్ ఇంజనీరింగ్ (లేదా) కంప్యూటర్ అప్లికేషన్స్ లో ఏదో ఒక కోర్స్ పూర్తి అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
2).బ్యాచిలర్ డిగ్రీలో సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్ (లేదా) కంప్యూటర్ సైన్స్ (లేదా) ఫిజిక్స్ (లేదా) మ్యాథమెటిక్స్ ఏదో ఒక సబ్జెక్టు కలిగి ఉండి డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
3). బ్యాచిలర్ డిగ్రీలో కంప్యూటర్ అప్లికేషన్స్ పూర్తి అయిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
నెలకు రూ.25,500/- నుంచి రూ.81,100/- వరకు.
అప్లికేషన్ ఫీజు/ పరీక్ష ఫీజు:
రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజు 450 రూపాయలు, పరీక్ష ఫీజు 50 రూపాయలు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు పరీక్ష ఫీజు రూ.50/- చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 జూన్ 3వ తారీకు నుంచి 2023 జూన్ 23వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
www.mha.gov.in (లేదా) www.ncs.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి.