Government Jobs: 10th క్లాస్ అర్హతతో 8,326 కానిస్టేబుల్ తరహా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు రేపే ఆఖరు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 8,326 ఎంటిఎస్ మరియు హవాల్దార్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు రేపటితో దరఖాస్తు గడువు ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 31వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 8,326 పోస్టులలో..
- MTS 4,887 పోస్టులు,
- హవాల్దార్ 3,439 పోస్టులు ఉన్నాయి. హవాల్దార్ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులు రెవెన్యూ శాఖలో కానిస్టేబుల్ తరహాలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగులోనూ పరీక్ష ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
MTS పోస్టులకు 18 నుంచి 25, హవాల్దార్ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు,
- బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
MTS పోస్టులకు రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. హవాల్దార్ పోస్టులకు రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు:
చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
ఈ ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
జనరల్/ బీసీ అభ్యర్థులకు రూ.100/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 2024 జూలై 31వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ |
పోస్టులు | ఎంటీఎస్ & హవాల్దార్ |
విద్యార్హత | 10th క్లాస్ |
వయోపరిమితి | 18 – 27 సం|| |
ఎంపిక విధానం | రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్ |
దరఖాస్తు | ఆన్లైన్ ద్వారా |
ఫీజు | రూ.100/- |
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు | చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. |
చివరి తేదీ | 31-07-2024 |
వెబ్సైట్ | ssc.gov.in |
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅SSC MTS,.. SSC GD Constable.. RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకొని, మీకు కావలసిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.