Fireman Jobs: 10th క్లాస్ అర్హతతో ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫైర్ మెన్, హెవీ వెహికల్ డ్రైవర్, లైట్ వెహికల్ డ్రైవర్, కుక్, అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియో గ్రాఫర్, ఫార్మాసిస్ట్, నర్స్, క్యాటరింగ్ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
1.క్యాటరింగ్ సూపర్వైజర్: 01 పోస్టు
2.నర్స్-బి: 07 పోస్టులు
3.ఫార్మసిస్ట్-ఎ: 02 పోస్టులు
4.రేడియోగ్రాఫర్-ఎ: 04 పోస్టులు
5.ల్యాబ్ టెక్నీషియన్-ఎ: 01 పోస్టు
6.ల్యాబ్ టెక్నీషియన్-ఎ(డెంటల్ హైజీనిస్ట్): 01
7.అసిస్టెంట్ (రాజ్భాష): 01 పోస్టు
8.కుక్: 04 పోస్టులు
9.లైట్ వెహికల్ డ్రైవర్- ఎ: 13 పోస్టులు
10.హెవీ వెహికల్ డ్రైవర్-ఎ: 14 పోస్టులు
11.ఫైర్ మెన్: 08 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 56.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణత, డిగ్రీ, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2023 ఆగస్టు 24 వ తారీకు నాటికి ఫైర్ మెన్ ఉద్యోగాలకు 18-25 ఏళ్లు; అసిస్టెంట్ పోస్టులకు 18-28 ఏళ్లు; మిగతా పోస్టులకు 18-35 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు ఐదేళ్లు; OBC అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
1.క్యాటరింగ్ సూపర్వైజర్: రూ.50,268/- per month
2.నర్స్-బి: రూ.63,758/- per month
3.ఫార్మసిస్ట్-ఎ: రూ.41,464/- per month
4.రేడియోగ్రాఫర్-ఎ: రూ.36,210/- per month
5.ల్యాబ్ టెక్నీషియన్-ఎ: రూ.36,210/- per month
6.ల్యాబ్ టెక్నీషియన్-ఎ(డెంటల్ హైజీనిస్ట్): రూ.36,210/- per month
7.అసిస్టెంట్ (రాజ్భాష): రూ.36,210/- per month
8.కుక్: రూ.28,258/- per month
9.లైట్ వెహికల్ డ్రైవర్: రూ.28,258/- per month
10.హెవీ వెహికల్ డ్రైవర్: రూ.28,258/- per month
11.ఫైర్ మెన్: రూ.28,258/- per month
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం:
2023 ఆగస్టు 4వ తారీకు నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ:
2023 ఆగస్టు 24 వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, గ్రామ సచివాలయం, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.