ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష లేదు, ఫీజు లేదు | APSRTC Recruitment 2024
APSRTC Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. మొత్తం 295 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 295 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవ తరగతి పాసై సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిషిప్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్రెంటిషిప్ ఖాళీలు గల ట్రేడ్స్:
డ్రాఫ్ట్స్ మన్ (సివిల్), ఫిట్టర్, మెషనిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్.
విద్యార్హతలు:
10th క్లాస్ పాసై సంబంధిత ట్రేడ్లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు:
రూ.118 ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు విధానం:
Online ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
www.apprenticeshipindia.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ పూరించాలి.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి తమ ప్రొఫైల్, అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ నెంబర్, పదవ తరగతి మార్కుల జాబితా, ఐటిఐ మార్కుల జాబితా, కుల దృవీకరణ పత్రము, ఆధార్ కార్డు,.. తదితర ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో, RESUME కాపీని తీసుకొని క్రింద తెలిపిన చిరునామాలో ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.
జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల, ఏ.పి.ఎస్.ఆర్.టీ.సీ., బళ్ళారి చౌరస్తా, కర్నూలు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ:
05-11-2024 తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
19-11-2024 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ధ్రువపత్రాల పరిశీలన జరుగు తేదీలు:
సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగు తేదీలు దినపత్రికల ద్వారా గాని, APSRTC వెబ్సైట్ www.apsrtc.gov.in ద్వారా గాని తెలియజేయబడును.
క్రింది లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి