APPSC Group 2 | ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్
APPSC Latest Update | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలో విడుదల చేసే గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు వయోపరిమితి పెంచింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నేరుగా భర్తీ చేసే నాన్ యూనిఫాం పోస్టులు మరియు యూనిఫాం పోస్టులకు సంబంధించి అభ్యర్థుల వయో పరిమితిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. నాన్ యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయోపరిమితిని 34 నుంచి 42 సంవత్సరాలకు పెంచింది. యూనిఫాం పోస్టులకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితికి అదనంగా రెండు సంవత్సరాలను పెంచింది. ఈ వయోపరిమితి పెంపుదల వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో విడుదల చేసే గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులకు ఈ వయోపరిమితి పెంపు వర్తిస్తుంది.
అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి