APPSC: గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల | 1:100 నిష్పత్తిలో ఎంపిక | APPSC Group-2 Preliminary Results 2024
APPSC Group-2 Results 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ వారంలోనే ఫలితాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు ఈ వారంలోనే విడుదల చేయడానికి ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. శనివారంలోగా ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నోటిఫికేషన్ విడుదలకు.. ప్రిలిమ్స్ పరీక్షకు మధ్య సమయం తక్కువగా ఉండడం, సన్నద్ధతకు సమయం సరిపోకపోవడం, ప్రశ్నపత్రం కఠినంగా ఉండడం, భారతీయ సమాజం చాప్టర్ కు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో ఆలస్యంగా రావడం.. వంటి కారణాలతో ఇబ్బంది పడ్డామని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున మెయిన్స్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని ఏపీపీఎస్సీ కార్యాలయానికి, ప్రభుత్వానికి అభ్యర్థనలు వస్తున్నాయి. దీనిపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ చురుగ్గా పరిశీలన చేస్తోంది. ప్రిలిమ్స్ ఫలితాల విడుదలనాటికి దీనిపై అధికారిక నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు.
✅నిరుద్యోగులకు కోసం: AP గ్రూప్-2 Mains ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.