December 20, 2024
AP Govt Jobs

APPSC Group 2: ఒక్కో గ్రూప్-2 పోస్టుకు 446 మంది పోటీ

APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల దరఖాస్తు గడువును ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారం రోజులపాటు పొడగించింది. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో ఒక్కో పోస్టుకు సగటున 446 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల దరఖాస్తు గడువును ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొడగించింది. మొత్తం 897 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల దరఖాస్తుకు బుధవారంతో(జనవరి 10) గడువు ముగిసినది. అయితే అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని దరఖాస్తుల గడువును వారం రోజుల పాటు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అభ్యర్థులు జనవరి 17వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఫిబ్రవరి 25వ తారీకున జరిగే ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. బుధవారం నాటికి సుమారు 4 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో ఒక్కో పోస్టుకు 446 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీ ముగిసే నాటికి అభ్యర్థుల సంఖ్య 5 లక్షలకు పెరిగే అవకాశం ఉంది.

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!