APPSC Group 2: గ్రూప్-2 ప్రిలిమ్స్ బిట్ బ్యాంక్ #2… ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ
ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ బిట్ బ్యాంక్
1).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా ఏది? ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది?
ప్రకాశం జిల్లా (14,322 చ.కి.మీ.)
2).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణపరంగా అతిచిన్న జిల్లా ఏది? ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది?
విశాఖపట్నం (1,048 చ.కి.మీ.)
3).ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీర రేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు?
974 కిలోమీటర్లు
4).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ఎక్కువ తీరరేఖ గల జిల్లా ఏది?
శ్రీకాకుళం
5).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ తీరరేఖ గల జిల్లా ఏది?
పశ్చిమగోదావరి
6).భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఏది?
ఆంధ్రప్రదేశ్
7).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పరంగా అతిపెద్ద జిల్లా ఏది?
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (24.697 లక్షలు)
8).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పరంగా అతి చిన్న జిల్లా ఏది?
పార్వతీపురం మన్యం జిల్లా (9.25 లక్షలు)
9).సముద్ర తీర ప్రాంతం గల ఏకైక రాయలసీమ జిల్లా ఏది?
తిరుపతి
10).దేశ అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ స్థానం (ఐఎస్ఎఫ్-2021 రిపోర్టు ప్రకారం)?
9వ స్థానం
11).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించిన మృత్తికలు/ నేలలు
ఎర్ర మృత్తికలు – 65%
12).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జాతీయ రహదారులలో కెల్లా పొడవైనది?
NH 16(5)
13).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ పొడవు జాతీయ రహదారులను కలిగి ఉన్న జిల్లా ఏది?
విజయనగరం
14).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వజ్రాల నిల్వలకు ప్రసిద్ధి.
వజ్రకరూర్ – అనంతపురం జిల్లా
15).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం?
లంబసింగి (-2℃)
16).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత గల ప్రాంతం?
రెంటచింతల
17).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన జిల్లాలు ఎన్ని?
2 ( పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా)
18).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు?
కొల్లేరు సరస్సు
19).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉప్పునీటి సరస్సు?
పులికాట్ సరస్సు
20).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం?
సీలేరు – శబరి లోయలలో
21).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం సంభవించే ప్రాంతం?
హగరీ నదీ లోయలలో
22).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మండలాలు గల జిల్లా ఏది?
ప్రకాశం జిల్లా (38)
23).ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ మండలాలు గల జిల్లా ఏది?
విశాఖపట్నం జిల్లా (11)
24).ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి స్థానాలు?
58
25).ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం అటవీ విస్తీర్ణం?
38,060.39 చదరపు కిలోమీటర్లు
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి