APPSC Group 2: గ్రూప్-2 ద్వారా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ.. అర్హత, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం వివరాలు..
APPSC Group 2: APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయోననే సమాచారాన్ని ఏపీ సర్కార్ సేకరిస్తోంది. ఇప్పటి వరకు గ్రూప్-2 కింద 1,082 పోస్టులున్నట్టు సంబంధిత అధికారులు గుర్తించారు. హెచ్ఓడీ లతో పాటు మరో 10 శాఖల పరిధిలో గ్రూప్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చారు. అయితే, వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అవుతోంది.
వీటిలో పలు శాఖల నుంచి 206 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను అధికారులు గుర్తించారు. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారానే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో 23 పోస్టులు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో 161 పోస్టులు, లా డిపార్ట్మెంట్ లో 12 పోస్టులు, లెజిస్లేచర్ డిపార్ట్మెంట్ లో 10 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఖాళీ పోస్టులను అధికారులు గుర్తించారు.
విద్యార్హతలు:
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోస్టులకు: ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
లెజిస్లేచర్ డిపార్ట్మెంట్ పోస్టులకు: ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోస్టులకు: మ్యాథమెటిక్స్/ కామర్స్/ ఎకనామిక్స్ సబ్జెక్టులలో ఏదో ఒక సబ్జెక్టు కలిగి ఉండి ‘డిగ్రీ’ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
‘లా’ డిపార్ట్మెంట్ పోస్టులకు: ‘లా’ డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
వయోపరిమితి:
18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. SC/ ST/ BC/ EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
రూ.40,970 నుంచి రూ.1,24,380 వరకు
ఎంపిక విధానం:
ప్రిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
క్రింది పట్టిక ద్వారా ప్రభుత్వం ఆమోదించిన సిలబస్ వివరాలు తెలుసుకోగలరు
Note: ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సిలబస్, దరఖాస్తు విధానం సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోగలరు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి