APPSC FBO Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర అటవీశాఖ పీసీసీఎఫ్ వై.మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండల పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్ లో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. అటవీశాఖలో ఖాళీగా ఉన్న 1,500 పోస్టులు భర్తీకి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లను నియమించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించామని, అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.
కాగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అర్హులు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అర్హులు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి