APPSC Exams Schedule: ఏపీపీఎస్సీ 21 ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలు విడుదల.. FBO, FSO, Thanedar, Grade-3 EO..
APPSC Exams Schedule: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 21 ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలు విడుదల చేసింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మెయిన్స్ పరీక్షల తేదీలు విడుదల చేసింది. అలాగే అటవీ శాఖలో తానేధర్ పోస్టులకు సంబంధించిన పరీక్ష తేదీలు విడుదల చేసింది. దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3, వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్, భూగర్భ జలవనరుల్లో టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్.. తదితర ఉద్యోగాల రాత పరీక్షల తేదీలు విడుదల చేసింది. ఈ పరీక్షలను 2026 జనవరి 27వ తారీకు నుంచి 2026 ఫిబ్రవరి 13వ తారీకు వరకు నిర్వహించనున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ పరీక్షలను ఫిబ్రవరి 9, 10 తారీకుల్లో నిర్వహించనున్నారు.

