APPSC: 48వేల జీతంతో ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
APPSC Analyst Grade-2 Notification 2024: ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2 టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 18 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు 2024 మార్చి 19వ తారీకు నుంచి 2024 ఏప్రిల్ 8వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
అనలిస్ట్ గ్రేడ్-2: 18 పోస్టులు
వయోపరిమితి:
2024 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు:
డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీలో కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ సబ్జెక్టు చదివి ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ.48,440/- నుంచి రూ.1,37,220/- వరకు.
ఎంపిక విధానం:
రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు/ పరీక్ష ఫీజు:
దరఖాస్తు ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.120
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
2024 మార్చి 19వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 ఏప్రిల్ 8వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.