December 24, 2025
AP Govt Jobs

AP SI Events 2023: ఎస్సై ఈవెంట్స్ తేదీలు విడుదల.. ఈవెంట్స్ కు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ తేదీలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB) అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ తేదీలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB) అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆగస్టు 25 నుంచి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, ఏలూరులో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఆగస్టు 14 నుంచి PMT/PET సంబంధించిన కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈవెంట్స్ కు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ వెంట స్టేజ్-2 అప్లికేషన్ ఫాం, విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లు  తెచ్చుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. వీటితోపాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకెళ్లండి. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎస్సై ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాతపరీక్షకు మొత్తం 1,51,288 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 57,923 మంది అభ్యర్థులు (38 శాతం) ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. వీరిలో 56,116 మంది అభ్యర్థులు స్టేజ్-2 అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారు. ఈ 56,116 మంది అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహించనున్నారు. మొత్తం 411 ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.

క్రింది లింక్ పై క్లిక్ చేసి ఈవెంట్స్ తేదీల వివరాలు డౌన్లోడ్ చేసుకోగలరు

Download PDF

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో  AP SI/Constable Mains, గ్రూప్-2, గ్రామ సచివాలయం ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!