AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సమగ్ర శిక్ష నుంచి ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నందు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి. https://apssa.aptonline.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
జూనియర్ అసిస్టెంట్- 13
డేటా ఎంట్రీ ఆపరేటర్- 10
ఆఫీస్ సబార్డినేట్- 37
దరఖాస్తు విధానం:
2023 జనవరి 31 వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
https://apssa.aptonline.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు:
జూనియర్ అసిస్టెంట్- ఏదైనా డిగ్రీ అర్హతతో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్- ఏదైనా డిగ్రీ అర్హతతో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి
ఆఫీస్ సబార్డినేట్- 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. తెలుగు మరియు ఇంగ్లీష్ రాయడం చదవడం వచ్చి ఉండాలి.
వయోపరిమితి:
2022 నవంబర్ 30 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. BC, SC, ST, PH’s అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
జీతం:
జూనియర్ అసిస్టెంట్- 23,500/-
డేటా ఎంట్రీ ఆపరేటర్- 23,500/-
ఆఫీస్ సబార్డినేట్- 15,000/-
ఎంపిక విధానం:
జూనియర్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్: 10th, ఇంటర్, డిగ్రీ అర్హతల్లో వచ్చిన మార్కులు మరియు స్కిల్ టెస్ట్ (MS-Office) ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆఫీస్ సబార్డినేట్: పదవ తరగతిలో వచ్చిన మార్కుల్ని ఆధారంగా చేసుకొని మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
ముఖ్యమైన తేదీల వివరాలు క్రింది పట్టికలో చూడగలరు
క్రింది నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.