AP రెవెన్యూ శాఖలో 982 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ | AP Revenue Department Jobs Notification 2024
AP Revenue Department Jobs: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో 982 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఖాళీల భర్తీ.
✅నిరుద్యోగులకు రిపబ్లిక్ డే ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో 982 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం (కలెక్టరేట్లు), అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 982 పోస్టులను త్వరగా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (ఎస్ఈసీ) ముఖేశ్ కుమార్ మీనాతో కలిసి ఆయన ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ పోస్టుల భర్తీకి జిల్లాల వారీగా, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నోటిఫికేషన్లు జారీ చేస్తారు. కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్.. తదితర పోస్టులు ఉంటాయి.
✅నిరుద్యోగులకు రిపబ్లిక్ డే ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి