ఏపీ జైళ్ల శాఖలో ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, డ్రైవర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ గుంటూరు జిల్లా నుంచి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు; బిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పోస్టును అనుసరించి 5వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి, బీ ఫార్మసీ/డీ ఫార్మసీ/ ఎమ్ ఫార్మసీ, డ్రైవింగ్ తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.