AP Outsourcing Jobs | 10th క్లాస్ అర్హతతో రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాత పరీక్ష లేదు. విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కడపలోని డైరెక్టోరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆఫీస్.. వైఎస్సార్ జిల్లాలోని వివిధ ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, పోస్టుమార్టం అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…
పోస్టుల వివరాలు:
1.ల్యాబ్ టెక్నీషియన్: 01 పోస్టు
2.రేడియోగ్రాఫర్: 01 పోస్టు
3.పోస్టుమార్టం అసిస్టెంట్: 05 పోస్టులు
4.థియేటర్ అసిస్టెంట్: 04 పోస్టులు
5.ఆఫీస్ సబార్డినేట్: 01 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య: 12.
వయోపరిమితి:
2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి 10వ తరగతి, బీఎస్సీ, CRA, DMLT.. అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
1.ల్యాబ్ టెక్నీషియన్: రూ.32,670/-
2.రేడియోగ్రాఫర్: రూ.35,570/-
3.పోస్టుమార్టం అసిస్టెంట్: రూ.15,000/-
4.థియేటర్ అసిస్టెంట్: రూ.15,000/-
5.ఆఫీస్ సబార్డినేట్: రూ.15,000/-
ఎంపిక విధానం:
విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
District Coordinator of Hospital Services,
“O” Block, New Collectorate,
Kadapa, YSR District.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ:
2023 సెప్టెంబర్ 15వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో APPSC గ్రూప్-2, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.