AP Job Mela: రేపు 3 జిల్లాల్లో మెగా జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు
AP Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో జనవరి 20వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్య గమనిక: జిల్లాల వారీగా జాబ్ మేళా నిర్వహించే కంపెనీల వివరాల కొరకు, అర్హతల వివరాల కొరకు, జీతభత్యాల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ లింకుపై క్లిక్ చేయండి.
👉ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ:
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
👉విద్యార్హతలు:
పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
👉వయోపరిమితి:
18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ:
- 20-01-2025 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
- ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.
- ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలను వెంట తీసుకొని వెళ్ళాలి
👉ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము:
- గుంటూరు జిల్లా: MBTS Government Polytechnic College, Nallapadu, Guntur- 522005.
- చిత్తూరు జిల్లా: TTDC Training Centre, Near Collector Office, Chittoor.
- చిత్తూరు జిల్లా: Government Degree College, Narayanavaram Road, Puttur.
- విశాఖపట్నం జిల్లా: District Employment Exchange, Old ITI Junction, Kancharapalem.
👉క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅AP Forest Beat Officer, AP SI/Constable, SSC GD Constable, SBI Clerk, RRB Group-D, RPF Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.