AP Government Jobs: వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సెప్టెంబర్ 27వ తారీకు లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…
పోస్టుల వివరాలు:
1.గైనకాలజిస్ట్- 1
2.అనస్థీటిస్ట్- 6
3.పీడియాట్రీషియన్- 1
4.ఫిజీషియన్- 4
5.జనరల్ సర్జన్-1
6.కార్డియాలజిస్ట్- 1
7.మెడికల్ ఆఫీసర్- 16
8.స్టాఫ్ నర్స్- 20
9.ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్- 2
10.ఆప్టోమెట్రిషియన్- 1
11.సోషల్ వర్కర్- 1
12.ల్యాబ్ టెక్నీషియన్- 1
13.న్యూట్రిషన్ కౌన్సెలర్- 1
14.అటెండర్ కమ్ క్లీనర్- 1
మొత్తం పోస్టుల సంఖ్య: 57.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, బీఎస్సీ నర్సింగ్, ఎంబీబీఎస్, డీజీవో, ఎండీ, పీజీ, ఎంఫిల్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2023 ఆగస్టు 1వ తారీకు నాటికి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితులో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
1.గైనకాలజిస్ట్- రూ.1,10,000/-
2.అనస్థీటిస్ట్- రూ.1,10,000/-
3.పీడియాట్రీషియన్- రూ.1,10,000/-
4.ఫిజీషియన్- రూ.1,10,000/-
5.జనరల్ సర్జన్- రూ.1,10,000/-
6.కార్డియాలజిస్ట్- రూ.1,10,000/-
7.మెడికల్ ఆఫీసర్- రూ.53,495/-
8.స్టాఫ్ నర్స్- రూ.22,500/-
9.ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్- రూ.30,000/-
10.ఆప్టోమెట్రిషియన్- రూ.24,310/-
11.సోషల్ వర్కర్- రూ.16,538/-
12.ల్యాబ్ టెక్నీషియన్- రూ.19,019/-
13.న్యూట్రిషన్ కౌన్సెలర్- రూ.23,625/-
14.అటెండర్ కమ్ క్లీనర్- రూ.12,000/-
ఎంపిక విధానం:
విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆఫ్లైన్ దరఖాస్తులను ఏలూరులోని డీసీహెచ్ఎస్ (DCHS) కార్యాలయంలో అందజేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 సెప్టెంబర్ 27వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి