AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకులో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. తెలుగు చదవడం, రాయడం రావాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 50 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
గుంటూరు డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.
👉పోస్టుల వివరాలు:
స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్: 50 పోస్టులు
👉విద్యార్హతలు:
- ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
- తెలుగు భాషా చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
- ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
👉వయోపరిమితి:
- 31-10-2024 తేదీ నాటికి 20 నుంచి 30 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉జీతభత్యాలు:
నెలకు రూ.33,637/- వరకు జీతం ఉంటుంది.
👉ఎంపిక విధానం:
- ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- పరీక్ష నూరు మార్కులకు నిర్వహిస్తారు.
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు, రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున నూరు మార్కులకు పరీక్ష ఉంటుంది.
- ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
- పరీక్షకు 60 నిమిషాల సమయం ఇస్తారు.
👉దరఖాస్తు విధానం:
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు:
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500
- ఓసి, బీసీ అభ్యర్థులు రూ.700 ఫీజు చెల్లించాలి
👉దరఖాస్తుకు చివరి తేదీ:
22-01-2025 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
👉క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅”AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP గ్రూప్-2 Mains.. AP Constable Mains” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.