AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో 16,347 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతిపెద్ద శుభవార్త చెప్పారు. విద్యా శాఖలో ఖాళీగా ఉన్న 16,347 ఉద్యోగాల భర్తీ దస్త్రంపై తొలి సంతకం చేశారు.
✅నిరుద్యోగుల కోసం: AP గ్రూప్-2 Mains ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు.. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు. త్వరలో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.
కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు
సెకండరీ గ్రేడ్ టీచర్: 6,371 పోస్టులు
స్కూల్ అసిస్టెంట్: 7,725 పోస్టులు
టీజీటీ: 1,781
పీజీటీ: 286
పీఈటీ: 132
ప్రిన్సిపాల్: 52