AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది మినీ అంగన్వాడి వర్కర్, అంగన్వాడి ఆయా పోస్టులను భర్తీ చేస్తున్నారు.
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వైస్సార్ కడప జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మినీ అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 7వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.
పోస్టుల వివరాలు:
1.మినీ అంగన్వాడి వర్కర్: 02
2.అంగన్వాడి హెల్పర్: 19
మొత్తం ఖాళీల సంఖ్య: 21.
ఖాళీలు గల ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టులు:
మొత్తం 7 ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు కలవు.
కడప, సీకే దిన్నే, బద్వేల్, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, వేంపల్లి.
విద్యార్హతలు:
7వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2023 జూలై 1వ తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
1.మినీ అంగన్వాడి వర్కర్: 7,000/-
2.అంగన్వాడి హెల్పర్: 7,000/-
ఎంపిక విధానం:
7వ తరగతిలో సాధించిన మార్కులు, అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలెను. దరఖాస్తుతో పాటు 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కులం, నివాసం, పుట్టిన తేదీ, వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 నవంబర్ 30వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ:
2023 డిసెంబర్ 8వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము:
సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి