AP Anganwadi Jobs: ఏపీలో 10th క్లాస్ అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP Anganwadi Jobs Notification Details
AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లా, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నుంచి అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 69 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం మహిళ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో.. ఖాళీ పోస్టు ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు వివాహితులై ఉండాలి. 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు దరఖాస్తుకు అర్హులు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా 2025 డిసెంబర్ 30 వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 69 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులో 11 అంగన్వాడి వర్కర్ పోస్టులు, 58 అంగన్వాడి హెల్పర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
AP Anganwadi Jobs విద్యార్హతలు
అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హత కలిగిన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి. CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాస్ కావలెను.
AP Anganwadi Jobs Age limit
అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలకు 2025 జూలై 1వ తారీఖు నాటికి 21 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
Salary
అంగన్వాడి వర్కర్ పోస్టులకు 11,500; అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు 7,000 జీతం ఉంటుంది.
Selection Process
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు .
దరఖాస్తు విధానం
- అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- మహిళా అభ్యర్థులు దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది.. తిరిగి సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించాలి.
- క్రింది నోటిఫికేషన్ లింక్ డౌన్లోడ్ చేసుకొని.. నోటిఫికేషన్ తో పాటు ఉన్న దరఖాస్తు ఫారం నమూనా చూడగలరు
- దరఖాస్తు చేసుకోగోరు మహిళలు ఖాళీ పోస్టు ఉన్న ప్రాంతంలో నివాసి అయ్యి ఉండాలి
- అభ్యర్థులు దరఖాస్తు ఫారం తో పాటు నోటిఫికేషన్ లో ఇచ్చిన పత్రాలను జతపరచాలి
దరఖాస్తు తేదీలు
అంగన్వాడీ వర్కర్ అంగన్వాడి హెల్పర్ పోస్టులకు 22-12-2025 తేదీ నుండి 30-12-2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

