ఇంటర్ అర్హతతో 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Constable Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 7565 ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 సెప్టెంబర్ 22వ తారీకు నుంచి అక్టోబర్ 21వ తారీకు వరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, దృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.