APPSC: ఏపీ అటవీ శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
APPSC: ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో డ్రాఫ్ట్స్ మన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్) ఉద్యోగాలు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్రాఫ్ట్స్ మన్ సివిల్ ఐటీఐ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హత కలిగిన అభ్యర్థులు 2025 సెప్టెంబర్ 18 వ తారీకు నుంచి అక్టోబర్ 8వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.250; పరీక్ష ఫీజు రూ.80 చెల్లించాలి. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

