APPSC FBO:: ఇంటర్ అర్హతతో ఏపీ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
APPSC FBO Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 691 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 16వ తారీకు నుంచి ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, వయస్సు, జీతం, సిలబస్, ఫిజికల్ టెస్ట్, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…
👉నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
👉 పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా 256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 435 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 691 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వయోపరిమితి:
ఈ ఉద్యోగాలకు 01-07-2025 తేదీ నాటికి 18 నుంచి 30 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉జీతభత్యాలు:
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు రూ.25,220 నుంచి రూ.89,910 వరకు జీతం ఉంటుంది. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు రూ.23120 నుంచి రూ.74,770 వరకు జీతం ఉంటుంది.
👉ఎంపిక విధానం:
స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉APPSC FBO స్క్రీనింగ్ టెస్ట్ విధానం:
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ (FBO) స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షలో రెండు పార్టులు ఉంటాయి. ప్రతి పార్ట్ నుంచి 75 ప్రశ్నలు వస్తాయి. మొత్తం స్క్రీనింగ్ పరీక్షలో 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షకు 150 నిమిషాలు సమయం ఇస్తారు.
👉APPSC Forest Beat Officer Syllabus 2025:
PART-A: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ: ఇందులో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి, 75 మార్కులు.
PART-B: జనరల్ సైన్స్ & జనరల్ మ్యాథమెటిక్స్: ఇందులో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి, 75 మార్కులు.
👉 దరఖాస్తు విధానం:
16-07-2025 తేదీ నుంచి 05-08-2025 తేదీ లోపు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
👉పరీక్ష ఫీజు/అప్లికేషన్ ఫీజు:
రూ.250/- అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు, రూ.80/- పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
👉 క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి:
✅AP Forest Beat Officer ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.