AP వ్యవసాయ శాఖలో రాతపరీక్ష లేకుండా టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | ANGRAU Recruitment 2025
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయసు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, గుంటూరు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు:
- టెక్నికల్ అసిస్టెంట్: 05 పోస్టులు
- ఫీల్డ్ అసిస్టెంట్: 04 పోస్టులు
- ట్రాక్టర్ డ్రైవర్: 01 పోస్టు
విద్యార్హతలు:
- టెక్నికల్ అసిస్టెంట్: 55% మార్కులతో నాలుగు సంవత్సరాల అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి అయిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు
- ఫీల్డ్ అసిస్టెంట్: Any B.Sc/ Polytechnic Diploma in Agriculture/ Seed Technology.
- ట్రాక్టర్ డ్రైవర్: 10వ తరగతి పాసై డ్రైవింగ్ లైసెన్సు కలిగి, ట్రాక్టర్ డ్రైవింగ్ విభాగంలో అనుభవం మరియు మోటార్ మెకానిక్ విభాగంలో అవగాహన కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
వయోపరిమితి:
18 నుండి 42 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
- టెక్నికల్ అసిస్టెంట్: రూ.35,400
- ఫీల్డ్ అసిస్టెంట్: రూ.29,200
- ట్రాక్టర్ డ్రైవర్: రూ.21,700
ఎంపిక విధానం:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు తమ బయోడేటా, కలర్ ఫోటో, ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ జిరాక్స్ సర్టిఫికెట్స్ తీసుకొని స్వయంగా ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
దరఖాస్తు ఫీజు:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు.
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ:
28-01-2025 తేదీ ఉదయం 10:00 గంటలకు ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం:
Administrative Office, ANGRAU, Lam, Guntur.
ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, AP SI/Constable, RRB Group-D, SBI Clerks ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.