APPSC Group 2: ఫిబ్రవరి 23న గ్రూప్-2 మెయిన్స్ నిర్వహణ
APPSC Group-2 Mains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23వ తారీకున నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) యోచిస్తోంది.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జనవరి 5వ తారీఖున నిర్వహించాలి. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష కేంద్రాల గుర్తింపు, అభ్యర్థుల సన్నద్ధతను దృష్టిలో పెట్టుకుని.. అలాగే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ తేదీని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ గతంలో వెల్లడించింది. అయితే డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడడంతో పాటు, అభ్యర్థుల నుంచి వస్తున్న వినతుల మేరకు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించాక అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.
గత కొద్దిరోజులుగా గ్రూప్-2 అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నాయకులు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్న విషయం తెలిసిందే. ప్రిపరేషన్ కు కనీసం మూడు నెలల గడువు ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాకుండా డిసెంబర్ చివరి వారంలో కానిస్టేబుల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్న కారణంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారు.
✅AP గ్రూప్-2 Mains, AP SI/Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.