AP Constable Events 2024: ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్ తేదీలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ PMT/PET ఈవెంట్స్ డిసెంబర్ చివరి వారంలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB) తెలిపింది. మొత్తం 95,208 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులు అయితే కేవలం 91,507 మంది అభ్యర్థులు మాత్రమే స్టేజ్-2 అప్లికేషన్ ఫిల్ చేశారని తెలిపింది.
స్టేజ్-2 అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయని అభ్యర్థులకు మరొక అవకాశం కల్పించింది. నవంబర్ 11వ తారీకు నుంచి నవంబర్ 21వ తారీకు లోపు స్టేజ్-2 అప్లికేషన్ ఫామ్ ఫీల్ చేయాలని తెలిపింది. ఇదివరకే ఫిల్ చేసిన అభ్యర్థులు, మరలా ఫిల్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులను డిసెంబర్ చివరి వారంలో నిర్వహించనున్నట్లు తెలిపింది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు డౌన్లోడ్ చేసుకోగలరు