తెలంగాణ విద్యుత్ శాఖలో 3 వేల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | TG Electricity Department Jobs 2024
తెలంగాణ విద్యుత్ సంస్థల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబరులో విద్యుత్ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వివరాలన్నీ పంపాలని విద్యుత్ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్లు సమాచారం.
ప్రాథమిక సమాచారం ప్రకారం 4 విద్యుత్ సంస్థల్లో 3 వేలకు పైగా ఖాళీలున్నట్లు తేలింది. వీటి సంఖ్య ఇంకా పెరగవచ్చని అంచనా. ఈ లెక్కలు తేలితే వచ్చే నెలలో నోటిఫికేషన్లు జారీచేసే అవకాశాలున్నాయని అధికారులు చెపుతున్నారు. ఒక్కో క్యాడర్ వారీగా వివరాలను సంస్థల యాజమాన్యాలు సేకరిస్తున్నాయి. ఇటీవల విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు, ట్రాన్స్కోలలో పెద్దఎత్తున పదోన్నతులిచ్చారు. ఈ పదోన్నతులతో కిందిస్థాయిలో 3 వేలకు పైగా ఖాళీలు ఏర్పడతాయని తేలింది. వీటన్నింటినీ నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. డిస్కంలలో కిందిస్థాయిలో అసిస్టెంటు లైన్ మెన్, జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజినీరు, AE తోపాటు ఇతర విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ట్రాన్స్కో, జెన్కోలలో AE పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ వచ్చే నెలలో భర్తీ చేయనున్నారు.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable, RPF SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.