తెలంగాణలో 11 వేల అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ | Tela Anganwadi Jobs Recruitment 2024
TG Anganwadi Jobs: తెలంగాణ మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖలో 11వేల అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్, మినీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం 11 వేల అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ పోస్టుల్లో హెల్పర్ల నుండి 50 శాతం పోస్టులను.. అర్హతను బట్టి టీచర్లుగా పదోన్నతి కల్పించనున్నారు. మిగిలిన పోస్టుల భర్తీకి జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. ఈసారి అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హత పెట్టే అవకాశం ఉంది. గతంలో ఈ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన ఉండేది. ఈసారి మార్పులు చేసే అవకాశం ఉంది.
అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, ఆయా ఉద్యోగాలకు 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏ ప్రాంతంలో ఖాళీ పోస్టు ఉంటుందో ఆ ప్రాంతంలోనే నివాసం ఉన్న వివాహిత మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.