తెలంగాణలో 10th, డిగ్రీ అర్హతలతో ఆఫీస్ సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TS Outsourcing Jobs 2024
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కొత్తగా ఏర్పడిన మెడికల్ కాలేజీల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. బుక్ బేరర్, స్టెనో / టైపిస్ట్ / డేటా ఎంట్రీ ఆపరేటర్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, కోడింగ్ క్లర్క్, డ్రైవర్, ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మాలి/ సబ్ స్టాఫ్, టైలర్, టెలిఫోన్ ఆపరేటర్, థియేటర్ అసిస్టెంట్, వ్యాన్ డ్రైవర్, కార్పెంటర్, అటెండెంట్, బార్బర్, సబార్డినేట్ స్టాఫ్, డార్క్ రూమ్ అసిస్టెంట్, ధోబి, ల్యాబ్ అటెండెంట్, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ క్లర్క్/ రికార్డ్ అసిస్టెంట్, వార్డ్ బాయ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
👉పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా బుక్ బేరర్, స్టెనో / టైపిస్ట్ / డేటా ఎంట్రీ ఆపరేటర్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, కోడింగ్ క్లర్క్, డ్రైవర్, ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మాలి/ సబ్ స్టాఫ్, టైలర్, టెలిఫోన్ ఆపరేటర్, థియేటర్ అసిస్టెంట్, వ్యాన్ డ్రైవర్, కార్పెంటర్, అటెండెంట్, బార్బర్, సబార్డినేట్ స్టాఫ్, డార్క్ రూమ్ అసిస్టెంట్, ధోబి, ల్యాబ్ అటెండెంట్, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ క్లర్క్/ రికార్డ్ అసిస్టెంట్, వార్డ్ బాయ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 155
👉విద్యార్హతలు:
పోస్టును అనుసరించి 10th క్లాస్, డిగ్రీ, డిప్లొమా, BSc MLT, DMLT అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయోపరిమితి:
18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.
👉ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష ఉండదు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం:
ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
👉దరఖాస్తు ఫీజు:
ఎటువంటి ఫీజు లేదు.
👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం, S-27, IDOC కార్యాలయం, పాల్వంచ.
👉దరఖాస్తుకు చివరి తేదీ:
2024 జూన్ 25వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.