APPSC: 57వేల జీతంతో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | APPSC JL Notification 2024
APPSC JL Notification 2023: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2 టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 47 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, సంస్కృతం, ఒరియా, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ సబ్జెక్టులకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు 2024 జనవరి 31వ తారీకు నుంచి 2024 ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
జూనియర్ లెక్చరర్: 47 పోస్టులు
సబ్జెక్టుల వారీగా ఖాళీలు:
ఇంగ్లీష్: 09
తెలుగు: 02
ఉర్దూ: 02
సంస్కృతం: 02
ఒరియా: 01
మ్యాథమెటిక్స్: 01
ఫిజిక్స్: 05
కెమిస్ట్రీ: 3
బాటనీ: 02
జువాలజీ: 01
ఎకనామిక్స్: 12
సివిక్స్: 02
హిస్టరీ: 05
వయోపరిమితి:
2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు:
సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
జీతభత్యాలు:
నెలకు రూ.57,100/- నుంచి రూ.1,47,760/- వరకు.
ఎంపిక విధానం:
రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు/ పరీక్ష ఫీజు:
దరఖాస్తు ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.120
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 ఫిబ్రవరి 20వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2 టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి